కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. విజయేందర్ రెడ్డి (38) అనే వ్యక్తి గత నాలుగు రోజులుగా కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో కరోనా వైరస్ చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి మృతి చెందాడు. అయితే..మూడు లక్షల రూపాయలు చెల్లిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి సిబ్బంది అంటుంది. ఇప్పటికే రెండున్నర లక్షల రూపాయలు హాస్పిటల్ కు విజయేందర్ బంధువులు చెల్లించారు. ఇప్పుడు మూడు లక్షల రూపాయలు చెల్లించాలని అంటున్నారని విజయేందర్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయాలో తోచక..కరోనావైరస్ తో మృతి చెందిన విజయేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. కాగా..కరోనా పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్నాయి. చివరికి పేషెంట్ మృతి చెందితే కూడా డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామంటూ కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి ఘటనలు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా కావడం గమనార్హం.
previous post