కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరాన్ని కొద్ది సేపటి క్రితం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సీబీఐ వాహనంలో చిదంబరంను అధికారులు తరలించారు. సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు ఆయన తరలించినట్టు సమాచారం. అంతకుముందు, చిదంబరం నివాసంలోకి సీబీఐ, ఈడీ అధికారులను అనుమతించకపోవడంతో వారు గోడ ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద దాదాపు గంట సేపు హైడ్రామా అనంతరం చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా జరుగుతున్న హై డ్రామాకు నేడు చెక్ పెడుతూ, చిదంబరం పోలీసులకు లొంగిపోయాడు.