మనుషులను త్వరగా అనుకరించే జీవులలో చింపాంజీలు, గొరిల్లాలు చెప్పవచ్చు. మనం ఏదైనా నేర్పితే అచ్చు మనలాగే ఆ జంతువులు చేసి చూపించగలవు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ చింపాంజీ ఇన్‌స్టాగ్రామ్‌ను చూస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అచ్చు మనుషుల్లాగే ఆ చింపాంజీ ఇన్‌స్టాగ్రామ్‌ను బ్రౌజ్ చేస్తోన్న తీరు కొందరు నెటిజన్లను ఆకట్టుకోగా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఇటువంటి జీవులకు మన టెక్నాలజీని నేర్పడం మన పతనానికి కారణమని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమాను గుర్తు చేసుకుంటూ.. టెక్నాలజీని వాటికి నేర్పితే ఆ మూవీలో మాదిరిగానే చింపాంజీలు మనపై దాడి చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదంతా పక్కనపెడితే ఇన్‌స్టాగ్రామ్‌ను చూస్తోన్న ఆ చింపాంజీ మాత్రం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారింది.
బీజేపీకి టీఆర్ఎస్ చాలాసార్లు మద్దతు: ఉత్తమ్