కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు ప్రార్మభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని తెలుస్తోంది. దాదాపు ఏడు నెలలుగా కరోనా వైరస్ సోకి అల్లాడుత్దున్న ప్రపంచ మానవాళికి నేడు ఈ శుభవార్త అధికారికంగా తెలుస్తుంది.
ఇప్పటికే రెండు దశల్లో వ్యాక్సిన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన ఆక్స్ ఫర్డ్, మూడవ దశ పరీక్షలను గత నెలలో బ్రెజిల్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బ్రెజిల్ లో వేలాది మందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించగా విజయవంతం అయినట్టు తనకు తెలిసిందని ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్, తన బ్లాగ్ లో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలో యాంటీ బాడీలు, టీ-సెల్ (కరోనా వైరస్ కిల్లర్ సెల్) లను జనరేట్ చేసిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్రభావవంతమైనదేనని ఆక్స్ ఫర్డ్ నిరూపిస్తే, సెప్టెంబర్ నుంచి భారీ ఎత్తున తయారీ జరుగుతుందని ఆయన అన్నారు.