telugu navyamedia
సినిమా వార్తలు

కీర్తి సురేష్ సినిమాలో గెస్ట్ గా ఎన్టీఆర్… క్లారిటీ వచ్చేసింది

NTR

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి “ఆర్ఆర్ఆర్” అనే భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అత్యంత్య భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. అయితే లేటెస్ట్‌గా కీర్తిసురేష్ తెలుగులో చేస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కీర్తి సురేష్ సినిమా నిర్మాత మ‌హేష్ కొనేరు ఒక‌ప్పుడు ఎన్టీఆర్ పి.ఆర్ టీంలో వ‌ర్క్ చేశారు. ఆ కార‌ణంగానే ఆయ‌న గెస్ట్ రోల్ చేస్తున్నార‌నేది ఆ వార్త‌ల సారాంశం. అయితే ఈ వార్త‌ల‌పై ఎన్టీఆర్ పి.ఆర్ టీం స్పందిస్తూ అలాంటిదేమీ లేద‌ని, సోష‌ల్ మీడియాలో వస్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌నీ కొట్టిపారేశారు. దీంతో కీర్తి సురేష్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ పై క్లారిటీ వచ్చేసింది.

Related posts