telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహారాష్ట్ర పరిణామాలపై హరీష్ శంకర్ సంచలన ట్వీట్

Harish

దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా మహారాష్ట్రలో జరిగిన రాజకీయా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించాడు. తాజాగా మహారాష్ట్ర జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠంపై జరిగిన పేచితో వీళ్లిద్దరు తమ మధ్య వున్నరాజకీయ బంధానికి వీడ్కొలు పలికారు. రాష్ట్రపతి పాలన తర్వాత శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సహాయం కోరాడు. ఈ ముగ్గురి మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమం కింద కొన్ని షరతులు విధించుకున్నారు. ఇక ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి.. వెంటనే మహారాష్ట్రలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ.. దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ విషయమై శరద్ పవార్.. తనకు తెలియకుండానే అజిత్ పవార్ తన పార్టీని చీల్చాడంటూ ఆయనను పార్టీ శాసనసభ పక్ష నేత పదవి నుంచి తొలిగించారు. ఈ విషయమై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “1978లో పవార్ కాంగ్రెస్ తరుపున గెలచి.. మర్నాడే పార్టీని చీల్చి ప్రొగ్రెసివ్ ఫ్రంట్ నెలకొల్పి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసారు. సరిగ్గా ఆయనకే ఈ పాఠం ఎదురవడం విశేషం. తాజాగా అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ శాసనసభ్యులు ఉన్నట్టు సమాచారం” అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related posts