telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రహస్యమైన కోరికలు…

కాగితం యోని మీద
కలం అంగం స్ఖలించే వీర్యం కవిత్వం
కడుపు లో పడేది
కాయో, పండో కాదు
కల్మషం
పుట్టేది భావం కాదు
ద్రోహం
అక్షరాలు
కవుల చెత్తాచెదారాలను మోసే
అడ్డగాడిదలు
పదాలు
పగిలిన గుండెలు
వాక్యాలు
అక్షరాల ఆత్మ హత్య కు పేనిన
ఉరి తాళ్లు
కవి
చచ్చిన శవానికి వైద్యం చేసే
వైద్యుడు
పాఠకుడు
శవం బతుకుతుందని నమ్మే
అమాయకుడు
సమాజం
గోడలు తప్పా పై కప్పు లేని వ్యభిచార గృహం
కాలం
నిన్ను నన్ను నిజాయితీ గా ద్వేషించే వేశ్య
సూర్యుడు, చంద్రుడు ఇద్దరు
వృద్ధులు అయిన విటులు
భూమ్యాకాశాలు మాత్రమే
బుద్ధి జీవులు
రహస్యమైన కోరికల మధ్య
అసహ్యమైన బతుకులు మనవి

Related posts