మాస్ అనే పదానికి డ్యాన్స్ అనే పదానికి సరికొత్త అర్థాన్ని చెప్పిన మెగాస్టార్, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఈ జెనరేషన్ సూపర్ స్టార్ కలిసి తెరపై కనిపిస్తే తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభవం అని కొత్తగా చెప్పనవసరం లేదు. తెలుగు తెరపై సరికొత్త మల్టీస్టారర్ రూపొందనుంది. మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రామ్‌చరణ్ లేదా మరెవరైనా ప్రముఖ హీరో నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. ఆ హీరో మహేష్ బాబే అని కొద్దిరోజులుగా ఫిలింనగర్‌లో ఓ వార్త గట్టిగా వినబడుతుంది. కట్ చేస్తే మెగాస్టార్, సూపర్ స్టార్ కలిసి తెరపంచుకోవడం ఖాయమైపోయింది.ఈ సినిమాలో మహేష్ ఓ కీలక ఎపిసోడ్‌లో కనిపించనున్నాడు. అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్‌లో మహేష్‌ను సరికొత్తగా చూపించనున్నారు కొరటాల. ఇందుకోసం మహేష్ 25 రోజులపాటు డేట్స్ కేటాయించాడు.. దాదాపు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు నిర్మాతలు.. మహేష్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.. మే నుంచి సూపర్ స్టార్ షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతి అక్రమాలపై సినిమా ఉంటుందని, నక్సలిజం బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుందని తెలుస్తోంది. చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. ‘ఆచార్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
previous post
ఆ వివాదాస్పద వీడియోను డిలీట్ చేసిన శ్రావణ భార్గవి..