telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

“సైరా” సినిమాకు వెళ్లిన ఎస్‌ఐలపై బదిలీ వేటు

jabapatibabu first look in sairaa movie

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన “సైరా” సినిమాకు వెళ్లిన ఎస్‌ఐలపై బదిలీ వేటు పడింది. విధి నిర్వహణలో ఉండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్‌ఐలపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు. కర్నూలు చెందిన ఆరుగురు ఎస్‌ఐలు బుధవారం తెల్లవారుజామున సైరా సినిమాకు వెళ్లారు.

అయితే వీరంతా పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లడంతో ఆరుగురు ఎస్‌ఐలను ఎస్పీ వీఆర్‌కు బదిలీ చేశారు. బదిలీ వేటు పడినవారిలో అవకు ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి, నందివర్గం ఎస్‌ఐ హరిప్రసాద్‌, బండి ఆత్మకూర్‌ ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్‌ఐ ప్రియతంరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ అశోక్‌ ఉన్నారు.

Related posts