తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రేషన్ నెమ్మదిగా మాయమవుతుంది. అంటే ఎవరో దొంగతనంగా తరలించేస్తున్నారు అనుకోకండి.. అసలు ప్రభుత్వమే ఇవ్వడం మానేస్తుందా, మధ్యలో వాళ్ళు నొక్కేసి లేదు అంటున్నారోగాని మొత్తానికి బియ్యం తప్ప ఏమీ దక్కవట ఇకమీదట. రేషన్‌షాపుల ద్వారా జంటనగరాల్లో 5,56,713మంది కార్డుదారులకు ప్రతి నెలా లీటర్ చొప్పున 5,56,713 లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. దీనికి మంగళం పాడేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఒకప్పుడు రేషన్‌షాపుల ద్వారా బియ్యంతోపాటు, చక్కెర, గోధు మలు, గోధుమపిండి, వంటనూనెలు, కిరోసిన్, చింతపండు, పసుపు, కారంపొడి, సబ్బులు, కంది పప్పు ఇలా అనేక రకాల సరుకులు పంపిణీ చేసేవారు. హైదరాబాద్‌లోని 9 సర్కిళ్లలో కలిపి ప్రస్తుతం 5,56,713 ఆహార భద్రతా కార్డులు ఉండగా నెలకు 12,106 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కొంతకాలం క్రితం వరకూ చక్కెర, గోధుమలు, కందిపప్పు, వంటనూనెలు, కిరోసిన్ అందించారు. తాజాగా హైదరాబాద్‌లో తప్ప మిగిలిన జిల్లాల్లో గోధుమలను నిలిపేసినట్టు సమాచారం. ఇక నెలకు అరకిలో చక్కెరను కూడా జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే రేషన్‌షాపుల్లో ఇస్తున్నారు. ఇందులోంచి కిరోసిన్‌కూ కోత పెట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్