telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్టు మంత్రి ప్రకటన..1669 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

Nirmala seetharaman

దేశ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా దేశీయ తయారీ రంగానికి కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్టు కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థికమంత్రి ప్రకటనతో స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.

మధ్యాహ్నం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 1,669 పాయింట్లు ఎగబాకి 37,764 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 480 పాయంట్ల లాభంతో 11,181కి పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఉన్న 30 కంపెనీలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి 10 శాతం పైగా లాభాల్లో దూసుకోపోతోంది.

Related posts