లోక్ సభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2020 బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దేశ ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఆశించినంత ఉపాధి దొరుకుందని, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని, మైనార్టీలకు, మహిళలకు, ఎస్సీఎస్టీల ఆశలను నెరవేర్చే విధంగా 2020 బడ్జెట్ ఉండబోతోందని నిర్మల చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో.. రెట్టింపు ఉత్సాహాంతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు.
దేశ ఆర్థిక విధానంపై ప్రజలు విశ్వాసం ఉంచారని మంత్రి చెప్పారు. ప్రజలు, ఉద్యోగులు లబ్ధి పొందాలని, వ్యాపారాలు ఆరోగ్యంగా ఉండాలని, మైనార్టీలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు.. ఈ బడ్జెట్ వల్ల తమ ఆశయాలను తీర్చుకోవాలన్నారు. ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్ ఉంటుందని, సంపదను సృష్టించడమే లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.