telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా బ్రదర్ స్లిమ్ లుక్… షాక్ లో అభిమానులు

Nagababu

ఇప్పుడున్న గ్లామర్ ప్రపంచంలో తారలు సెట్స్ లో కన్నా జిమ్ లోనే ఎక్కువగా కష్టపడుతుంటారు.వెండితెరపై గ్లామర్ గా కనిపించడానికి గంటల కొద్ది వర్కవుట్స్ చేస్తారు. ఇటీవలే కాలంలో ఊహించని విధంగా బరువు తగ్గి మెస్మరైజ్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రజంట్ ఆయన ఉన్న ఏజ్ కంటే 10 ఇయర్స్ తక్కువగా కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నాగబాబు ఏజ్58 సంవత్సరాలు. పైన పిక్ చూసి ఆ మాట చెప్పమంటే చెప్తారా..? నో వే. కేవలం ఆరు నెలల్లో క్రమక్రమంగా తనను తాను మలుచుకున్నారు మెగా బ్రదర్. ఆయన ప్రజంట్ స్లిమ్‌గా, యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. కాగా ఇలా మేకోవర్ అవ్వడానికి నాగబాబుకి కేవలం ఆరు నెలలే పట్టిందట. ఈ ఆరు నెలల మధ్యలో ఆయన దిగిన మూడు ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు. వాటికి తోడు…నిర్ణయించుకోని, ఆచరణలో పెట్టి.. సాధించాను అనే ట్యాగ్ లైన్‌ కూడా ఇచ్చారు. ప్రజంట్ ఆయన ఉన్న లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Related posts