telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అఫీషియల్ : నాని ‘వి’ డిజిటల్ రిలీజ్ డేట్ ప్రకటన

v

ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేద థామస్, అదితిరావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాని మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే మూవీ మేకర్స్ ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు . అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నారు . ఈ మేరకు హీరో నాని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ” ‘వి ‘ సినిమాను మే 25న విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ కొన్నికారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 5 న సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఈ 12 ఏళ్ళు మీరు నాకోసం థియేటర్స్ కు వచ్చారు. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను. అలాగే థియేటర్స్ ఓపెన్ అయినా వెంటనే ‘టక్ జగదీశ్’ సినిమాతో పలకరిస్తాను ” అంటూ పోస్ట్ చేశారు.

Related posts