నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ వేగవంతం చేసింది మూవీ టీం మంగళవారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది.ఇందులో భాగంగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లోని ప్రతీ డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం.
నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. ఇక డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
“దిల్ బేచారా” హీరోయిన్ పై రియా సంచలన వ్యాఖ్యలు