తన మధురమైన స్వరంతో మంచి సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి దగ్గరైన తెలుగింటి ఆడపడుచు సునీత. ఆమె పాట పాడితే వినసొంపుగా ఉంటుంది. ఆమె మాటలు ముత్యాలు రాలినట్టే అంత అందంగా ఉంటాయి. ఆమె అందం హీరోయిన్‌కి ఏమాత్రం తక్కువ కాదు. కానీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత.. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు.
సునీత కొన్ని రోజుల కిందట రామ్ వీరపనేని అనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వీళ్ళ జీవితం ఎంత సంతోషంగా ఉందనేది.. సునీత పంచుకునే ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
సునీత తన భర్త తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని తెలిపింది ‘‘రామ్ చాలా మంచి వ్యక్తి. పెళ్లి ప్రపోజల్‌తో నా వద్దకు వచ్చినప్పడు ‘నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకుంటే నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే బాధపడతాను.. కానీ నా లైఫ్ మాత్రం ఎక్కడ ఆగదు’ అని చెప్పాడు. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చింది’’
కానీ..‘‘చాలా మంది ఆడవాళ్లు నా గురించే తప్పుగా మాట్లాడుకున్నారు. నా బాధ్యతలన్ని ఎవరో వ్యక్తి చూసుకుంటున్నారని కామెంట్లు కూడా చేశారు. డబ్బు కోసమే రామ్‌ని పెళ్లి చేసుకున్నానన్నారు. ఆయనకు ఎంత ఆస్తి ఉందనే విషయం నాకు ఇప్పటికీ తెలియదు. ఆయన కంపెనీ టర్నోవర్ ఎంతో ఐడియా లేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరిపై ఒకరికి పరస్పరం గౌరవం ఉంది’’
మొదటి పెళ్లి, బ్రేకప్ తర్వాత రామ్‌తో పెళ్లి జరిగే వరకూ సుమారు 15 సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఇంకెన్నో సమస్యలు చూశాను. నాకు తగిలిన దెబ్బలకు మనుషుల్ని నమ్మడం కూడా మానేశాను’’అంటుంది సునీత.. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.