telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చరిత్ర మిమ్మల్ని క్షమించదు… సోనియా గాంధీపై కంగనా ఘాటు ట్వీటు

Sonia-Gandhi

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పలువురి మద్దతు లభిస్తోంది. కాగా ఇప్పటికే ఆమె కార్యాలయాన్ని కూల్చివేయగా… మరోవైపు మహారాష్ట్ర హోంమంత్రి కంగనా డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఆమెను డ్రగ్స్ అంశంలో విచారించేందుకు ముంబై పోలీసులకు విచారణ బాధ్యతను అప్పగించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు అందినట్లు సమాచారం. దీనికి సంబంధించి విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి ఆమెపై ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కంగనా అభిమానులు ఆరోపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశించి కంగనా రనౌత్‌ చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ మేరకు కంగనా “ప్రియమైన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గారు..మీ ప్రభుత్వం సాటి మహిళను పెడుతున్న ఇబ్బందులు చూసి ఓ మహిళగా మీకు వేదన కలగడం లేదా ? అంబేద్కర్‌గారు మనకు ఇచ్చిన రాజ్యాంగంలోని సూత్రాలను పాటించాలని మీ ప్రభుత్వానికి మీరు సూచించలేరా? విదేశాల్లో పెరిగిన మీరు ప్రస్తుతం ఇండియాలో నివస్తున్నారు. మీ మౌనం చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. మీ సొంత ప్రభుత్వమే ఓ మహిళను తీవ్రంగా వేధిస్తోంది. మహా సర్కారు చేస్తున్న అరాచకంపై ఇప్పటికైనా కలగ చేసుకుంటారని భావిస్తున్నాను. శివసేన వ్యవస్థాపకులు బాల్‌ థాకరే నాకెంతో ఇష్టమైన, ఆరాధ్యమైన వ్యక్తి. ఏదో ఒకరోజు శివసేన పార్టీ కాంగ్రెస్‌ పార్టీతో గ్రూపు కడుతుందేమోనని ఫీల్‌ అయ్యారు. ఆయన అప్పుడు ఫీల్‌ అయిన విషయమే ఇప్పుడు శివసేన పార్టీలో కనిపిస్తోంది” అంటూ కంగనా అటు సోనియా గాంధీ శివసేన ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related posts