న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు.కలకత్తా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.
ఈ సినిమా ఈనెల 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నిర్మాత దిల్‌రాజు చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం వరంగల్ లో జరిగింది. ఈ వేడుకలో భాగంగా నాని మాట్లాడుతూ “‘నాకు కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. మీరంటే ఇంకా ఇష్టం.
నాన్ స్టాప్ గా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముందు పుష్ప, వెనుక ఆర్ఆర్ఆర్… ఏంటి ‘శ్యామ్ సింగ రాయ్’ సాండ్ విచ్ అయిపోతుందా ? అని ఓ ఫ్రెండ్ మీమ్ పంపించారు… బ్రెడ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది మధ్యలోనే సర్ప్రైజ్ ఉంటుంది. ఈ సంక్రాంతి మనదే… నేను సినిమా చూశాను కాబట్టి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది.
ఒక మంచి సినిమా చేశాక.. మనసులో ఓ నిండు గర్వం కనిపిస్తుంది. ‘శ్యామ్ సింగరాయ్’ చేశాక నాకలాంటి అనుభూతే కలిగింది. కచ్చితంగా చెబుతున్నా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా బయటకు వెళ్తారు. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను.
తెలుగు సినిమా ఉన్నంత కాలం.. మ్యూజిక్ ఉన్నంత కాలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జీవించే ఉంటారు. ఆయన ఆఖరి పాట మా ‘శ్యామ్ సింగరాయ్’లో ఉండటం వల్ల ఈ సినిమా మరింత స్పెషల్‌గా మారిపోయింద”న్నారు నాని.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ సినిమాలో దేవీ మీద ఓ పాట రాశారు. దేవీ మీద రాసిన పుస్తకాలన్నీ 45రోజుల పాటు చదివి ఆ పాట రాశానని శాస్త్రి గారు చెప్పారు. దేవీ పాటలో సాయి పల్లవి మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ చేసింది. ఇది త్వరలో రిలీజ్ చేయబోతున్నాము. కీర్తిగా కృతి అద్భుతంగా నటించింది.
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సినిమాను మరింత బాగా తీర్చిదిద్దడానికి కష్టపడుతున్నారు, నిర్మాత వెంకట్ బోయినపల్లి నన్ను చాలా గారాబం చేశారు.
ఈ డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. మీరు మిస్ అయ్యారని తెలుసు. నేను కూడా మిస్ అయ్యాను. కానీ ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు’ ఈ క్రిస్మస్ మనదే అని నాని గర్వంగా చెప్పారు.
అంతా నా విగ్రహాలు పెట్టుకోవాలి : నటి హేమ