telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ సెకండ్ లిరికల్ ప్రోమో వచ్చేసింది…

దర్శకధీరుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో న‌టిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడువచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుందీ చిత్రం.

Will RRR - Baahubali Maker Rajamouli

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​లో భాగంగా మూవీలోని ‘నాటు నాటు’ అనే పాట ప్రోమోను రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సోష‌ల్ మీడియాలో రికార్డ్‌లు సృష్టించాయి.

తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో.. నా పాట సూడు.. నాటు.. నాటు.. నాటు.. నాటు.. వీర నాటు అంటూ సాగుతున్నట్లుగా కనిపిస్తోంది.దీన్ని చూస్తుంటే ఈ గీతంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు తెలుస్తోంది.ఈ పాటను చంద్రబోస్ రచించగా.. రాహుల సిప్లిగంజ్, కాలబైరవ ఆలపించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక నాటు నాటు వీర నాటు పాటను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.

RRR Movie (@RRRMovie) / Twitter

డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.

Related posts