నగరి వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏమి చేసిన విన్నూత్నంగా ఉంటుంది..రోజుకో ఆటతో అదరగొడుతున్నారు.. ఇటీవల కబడ్డీ , వాలీబాల్ ఆడగా తాజాగా బ్యాట్మింటన్ ఆడి అదరగొట్టారు. ఎప్పడూ రాజకీయాల్లో బిజి బిజీగా ఉండే రోజా వీలుదొరికినప్పడ్డల్లా ఆటపాటల్లతో సందడి చేస్తున్నారు.
రోజా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా సంబరా ల్లో భాగంగా సోమవారం బాల్ బ్యాడ్మింటన్ పోటీ లు జరిగాయి. నగరి, పుత్తూరు మండలాలకు సంబంధించిన పోటీల్లో ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణి, సోదరుడు కుమారస్వామిరెడ్డితో బ్యాట్మింటన్ ఆడి ప్రేక్షకులని ఉత్తేజపరిచారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిభ ఉన్నా అవకాశం లేక అనేక మంది క్రీడాకారులు మరుగున పడుతున్నారని, అందువల్లే మండల, నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికే గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్కేరోజా తెలిపారు.
పోటీల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘ డైరెక్టర్ చంద్రారెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బీఆర్వీ అయ్యప్పన్, నాయకులు దయానిధి, మురుగ, మునికృష్ణారెడ్డి, అయ్యప్ప, కన్నాయిరం తదితరులు పాల్గొన్నారు.
175 సీట్లలో గెలుస్తాం.. మళ్ళీ అధికారం మాదే: లోకేశ్