telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌ బాస్‌ సీజన్‌-3″లో నయనతార

nayanatara movie ira grand release

“బిగ్‌ బాస్‌ సీజన్‌-3″లో నయనతార హోస్ట్‌గా నటించనున్నట్టు కోలీవుడ్‌ సమాచారం. విజయ్‌ టీవీ నిర్వహిస్తున్న బిగ్‌ బాస్‌ షోకు విశ్వనటుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. త్వరలో బిగ్‌బాస్‌-3 సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ రాజకీయాల్లో, శంకర్‌ దర్శకత్వంలో “భారతీయుడు-2″లో బిజీగా ఉండడంతో ఈ షో నుంచి తప్పుకున్నట్టు సమాచారం. దీంతో మరో ప్రముఖ నటులను బిగ్‌ బాస్‌ షోలో నటింపజేసేందుకు నిర్వాహకులు పలువురితో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతారతో ఈ షోని చేయించేందుకు నిర్వాహకులు సంప్రదింపులు జరిపారు. అయితే నయనతార ప్రస్తుతం దక్షిణాది భాషా చిత్రాల్లో బిజీగా వుండడంతో డేట్స్‌ కుదురుతాయా అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ ఆమె నిరాకరిస్తే సూర్య, కార్తీక్‌లతో కూడా షోను నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Related posts