ఈ ఏడాది ఐపీఎల్ వచ్చే నెల 9 న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రాక్టీస్ క్యాంప్‌లు నిర్వహించేందుకు ఆయా జట్లు సన్నదమవుతున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తమ హోం గ్రౌండ్ చెపాక్ మైదానం వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ షురూ చేయగా.. ఇతర ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్ల క్వారంటైన్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తున్నాయి. అయితే ప్రాక్టీస్ క్యాంప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ముంబై వెళ్తుండగా.. ముంబై ఇండియన్స్ చెన్నైకి రానుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కరోనా రూల్స్ ప్రకారం ఈసారి సొంతగడ్డపై ఏ జట్టు మ్యాచ్ ఆడటం లేదు. ఈ క్రమంలోనే ధోనీసేన ఆడే తొలి ఐదు మ్యాచ్‌లు ముంబైలో ఆడనుండగా.. ముంబై ఇండియన్స్ చెన్నై వేదికగా ఆడనుంది. దాంతో తమ ప్రాక్టీస్ క్యాంప్‌లను ఆయా నగరాల్లోనే నిర్వహించుకోవడం ఉత్తమమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ త్వరలోనే ముంబైకి పయనం కానుండగా ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై కి వస్తుంది.
previous post