telugu navyamedia
క్రీడలు

నన్ను రెచ్చగొట్టడంవల్లే ఆ ఆరు సిక్స్ లు కొట్టా : యువరాజ్ సింగ్

youraj

ఇంగ్లాండ్ తో జరిగిన 2007 సెప్టెంబర్ 19 టీ ట్వంటీ ప్రపంచకప్ సందర్భంగా భారతీయ ఆల్ రౌండర్ యూవరాజ్ సింగ్ ఒకే ఓవర్లో వరుసగా ఆరుసిక్సర్లు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో కొట్టాడు. అయితే ఆరోజును గుర్తు చేసుకుంటూ యూవరాజ్ సింగ్ తన మనసులోమాటని బయటపెట్టాడు. అంతకు ముందుఓవర్లో ఏంజరిగిందో వెల్లడించాడు. నిజానికి ఆరు సిక్స్ లు కొట్టాలని నా మనసులో లేదని అంతకుముందు ఓవర్లో నేను ప్లింటాఫ్ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టాను అది అతనికి నచ్చలేదు. నా షాట్లు నవ్వుతెప్పించేవిధంగా ఉన్నాయని ప్లింటాఫ్ రెచ్చగొట్టడంవల్ల ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్లింటాఫ్ నీ గొంతుకోస్తానని అన్నాడు వెంటనే నేను నా చేతిలో బ్యాట్ చూసావా దీంతో నిన్ను నేను ఎక్కడకొట్టబోతానో తెలుసా అని సమాధానమిచ్చాను. ఆ వెంటనే అంపైర్ కలుగజేసుకున్నాడు. ఆ వాదనతో నాకు కోపం వచ్చింది ఆతరువాత ప్రతిబంతిని బౌండరీ దాటించాలనుకున్నాను. అయితే ఆరోజు నారోజు అలా ఆరు సిక్సలు కొట్టాను. ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది అలాఎలా కొట్టానా అని అంటూ తన మనసులోమాటచెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.

Related posts