telugu navyamedia
క్రీడలు వార్తలు

కేన్ వికెట్ పై ఉమేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న న్యూజిలాండ్‌, భారత్‌ జట్లు టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. తొలిసారి జరుగుతుండడంతో అందరి దృష్టి ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌పైనే ఉంది. అయితే ఉమేష్ యాదవ్ టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌పై స్పందించాడు. ‘కేన్ విలియమ్సన్‌ ఆట గురించి మాకు మంచి అవగాహన ఉంది. అయినప్పటికీ అతనికి చాలా బలహీనతలు ఉన్నాయని నేను అనుకోను. అయితే ఎంతటి స్టార్ బ్యాట్స్‌మన్‌ అయినా ఓ మంచి బంతికి ఔట్ అవ్వాల్సిందే. కాబట్టి ఓ ఫాస్ట్ బౌలర్‌గా తన బలాలకు కట్టుబడి ఉండాలి. పదేపదే అలాంటి బంతులు వేస్తె వికెట్లు పడతాయి. మేము కేన్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేయాలి. అది జట్టుకు తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుంది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఉమేష్ పేర్కొన్నాడు. ‘న్యూజిలాండ్ బలమైన జట్టు. వారికి లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అంతేకాదు కివీస్ పేసర్లు చాలా అనుభవజ్ఞులు, ప్రమాదకారులు. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇంగ్లీష్ పరిస్థితులు కూడా మాకు పెద్ద సవాలు విసిరే అవకాశం ఉంది. అందులోనూ న్యూజిలాండ్ వంటి జట్టుతో అంటే మాములు విషయం కాదు’ అని ఉమేష్ యాదవ్ అన్నాడు. ఉమేష్ 48 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు కాని ఇప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఖచ్చితంగా చోటు ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి.

Related posts