telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ బాబు విడుదల చేసిన ”ఏవో ఏవో కలలే”…

ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ‘లవ్ స్టోరి’. ఈ అందమైన ప్రేమ కథలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై నాగచైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు.  ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా అనే సాంగ్ అలాగే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుండి ‘ఏవో ఏవో కలలే’ లిరిక‌ల్ సాంగ్ ను సూపర్ స్టార్ మహెహ్ బాబు విడుదల చేసాడు. ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకులముందుకు రానుంది. చుడాలిమరి ఈ సినిమా నాగ చైతన్య ఆశలను నిలబెడుతుందా… లేదా అనేది.

Related posts