*నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం
*32 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగనున్నాయి. అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అదే సమయంలో విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ సిద్ధం అయ్యింది.
నేటి నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
ఈ సమావేశాల్లో మొత్తం 32 బిల్లుల వరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా అగ్నిపథ్ పథకంపై పార్లమెంటు ఉభయ సభలు అట్టుడగునున్నాయి. అగ్నిపథ్ పథకం తేవడంతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే.
అగ్నపథ్ ను వెనక్కు తీసుకోవాలని విపక్షాలు ఈ సమావేశాల్లో డిమాండ్ చేయనున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసరాల వస్తువుల పెరుగుదల.. ఈడీ, సీబీఐ దాడులు, ప్రజాస్వామ్యం గొంతునొక్కే చర్యలపై కూడా అధికార పార్టీని నిలదీయాలన్న యోచనలో విపక్షాలు ఉన్నాయి.
జగన్ మేనమామ బినామీకి టెండర్: దేవినేని ఉమ