telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు అకాడమీని విభజించేందుకు కేంద్రం సహకరించాలి: లోక్ సభలో వైసీపీ ఎంపీ

raghurama krishanam raju

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీని విభజించేందుకు కేంద్రం సహకరించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. విభజన చట్టంలో తెలుగు అకాడమీ కూడా ఉందని లోక్ సభలో ప్రస్తావించారు. తెలుగు అకాడమీకి చెందిన వందల కోట్ల నిధులు హైదరాబాదులోనే ఉండిపోయాయని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీకి చెందిన నిధులను 58:42 నిష్పత్తిలో విభజించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నామంటూ వైసీపీ ప్రభుత్వం ఓ వైపు చెబుతుంటే… లోక్ సభలో దానికి విరుద్ధమైన వాదనను రఘురామ కృష్ణంరాజు వినిపించారు. మాతృ భాషను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగంలో మాతృ భాష పరిరక్షణకు ఉద్దేశించిన ఆర్టికల్ 350, 350ఏల స్ఫూర్తి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts