telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రెండో విడత పంచాయతీ ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..

నేటి నుంచి ఏపీలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.. 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు 175 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.. మొత్తం 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం.. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి రెండోదఫా ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉండగా… రెండో విడత ఎన్నికల పూర్తి వివరాలను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది.  

రెండో విడత ఎన్నికల వివరాలు:

అనంత- 310 పంచాయతీలు.

చిత్తూరు-276 పంచాయతీలు.

తూర్పు గోదావరి- 247 పంచాయతీలు.

గుంటూరు- 237 పంచాయతీలు.

కడప-175 పంచాయతీలు.

కృష్ణా-211 పంచాయతీలు.

కర్నూలు-240 పంచాయతీలు.

నెల్లూరు-198 పంచాయతీలు.

ప్రకాశం-277 పంచాయతీలు.

శ్రీకాకుళం- 278 పంచాయతీలు.

విశాఖ- 261 పంచాయతీలు.

విజయనగరం- 415 పంచాయతీలు.

పశ్చిమ గోదావరి- 210 పంచాయతీలు.

Related posts