telugu navyamedia
తెలంగాణ వార్తలు

మోదీజీ గారు ..మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ..

గుజరాత్ లో 10ఏళ్ల కిందట జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మోదీగారు ..మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ విమ‌ర్శించారు ..రెమిషన్ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

గుజరాత్‌లో 11 మంది రేపిస్టులను విడుదల చేయడాన్ని చూస్తేనే ఈ విషయం అర్థమవుతోందని మండిపడ్డారు. మహిళలను గౌరవించాలంటూ మీరు చెప్పే మాటలపై మీకు చిత్తశుద్ధి ఉంటే.. గుజరాత్ ప్రభుత్వ రెవిషన్ ఉత్తర్వులపై జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఎంహెచ్‌ఏ ఆర్డర్‌కు వ్యతిరేక చర్యలు అసహ్యంగా ఉంటాయన్న కేటీఆర్‌.. దేశం పట్ల ప్రధానికున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు.

2002లో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు.. బాధితురాలి కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరిని గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం విడుదల చేశారు. అయితే రేప్ కేసులో రెవిషన్ ప్రకారం దోషులను విడుదల చేయడాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1992 నాటి రెమిషన్ విధానం ప్రకారమే ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

Related posts