telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మంత్రి పదవి నుండి ఈటల ఔట్…

ఈటల రాజేందర్ పై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఈరోజే కలెక్టర్ నివేదికను కూడా సమర్పించారు.  ఈటల రాజేందర్ భూములను కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హేచరీస్ ఆధీనంలో భూములు ఉన్నట్టు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు.  హాకింపేట, అచ్చంపేట గ్రామాల్లో భూములు కబ్జా జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. దాంతో ఈరోజు ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుండి తొలగించారు. ఈ మేరకు గవర్నర్ కు లేఖ పంపింది సీఎం కార్యాలయం. దాంతో ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపింది గవర్నర్ కార్యాలయం. చివరి నిమిషం వరకు ఈటల రాజీనామా చేయలేదు. అయితే నిన్ననే ఈటలను ఆరోగ్య శాఖ నుండి తొలిగించగా ఈరోజు మంత్రి పదవి నుండి తీసేసారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఈ వార్త తెలంగాణలో హల చల్ చేస్తుంది.

Related posts