telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

బేగంపేట్ బ్రాహ్మణ వాడిలో నాలా పనులను పరిశీలించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురబి వాణి దేవి

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బేగంపేట్ బ్రాహ్మణ వాడి ప్రాంతంలో నాలా పనులను ఎమ్మెల్సీ సురబి వాణి దేవితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… బేగంపేట్ డివిజన్ లో వర్షాకాలంలో కూకట్ పల్లి నాలా ను ఆనుకొని ఉన్న బ్రాహ్మణ వాడి, మయూర్ మార్గ్, ప్రకాష్ నగర్, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, అల్లంతోట బావి, వడ్డెర బస్తీ లు ముంపుకు గురవుతున్నాయని, వీటి నివారణకు రూ. 45 కోట్లతో ఎస్.ఎన్.డి.పి కింద పనులను చేపడుతున్నారని తెలిపారు. నాలాల రిటైనింగ్ వాల్స్ మరమ్మతుల తో పాటు కొత్తవి ఏర్పాటు చేయాలని తెలిపారు. సీవరేజ్ పైప్ లైన్, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్స్ వేర్వేరుగా నిర్మించాలని తెలిపారు. బారీ వర్షాలకు నాలాల నీరు పొంగిపొర్లకుండా రిటైనింగ్ వాల్ ఎత్తును పెంచడంతో పాటు లోతట్టు ప్రాంతాలకు ప్రవహించకుండా సంపులను నిర్మించి పంపింగ్ ద్వారా నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్రాహ్మణవాడి నుండి గీతాంజలి స్కూల్ వరకు రూ. 39 కోట్లతో నిర్మించనున్న వి.డి.సిసి రోడ్లు, సీవరేజ్ లైన్లు వేగవంతంగా పూర్తిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ వాడి నాలా పక్కన ఉన్న స్వామి రామనందతీర్థ ట్రస్ట్ ను సందర్శించి వర్షపు నీరు నిలువకుండా గేట్ల ద్వారా నీటిని నాలాలోకి మళ్లించాలన్నారు. ఈ ట్రస్టులో ర్యాంపు నిర్మానానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ట్రస్టులో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులను, విద్యార్థులకు అందిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రస్టులోని మాజీ ప్రధాని పి.వి.నర్సింహా రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఎన్.డి.పి ఎస్.ఇ భాస్కర్ రెడ్డి, ఇ.ఇ సుదర్శన్, వాటర్ వర్క్స్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts