telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీని చూసి నేర్చుకో రాయుడు అంటున్న పీటర్స‌న్…

కొన్ని విషయాలు కోహ్లీని చూసి రాయుడు నేర్చుకోవాలి అని పీటర్స‌న్ అంటున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అయిన అంబటి రాయుడిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్స‌న్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికెట్ల మధ్య రాయుడు చాలా నెమ్మదిగా పరుగెడుతున్నాడని, క్విక్ డబుల్స్, సింగిల్స్ తీయడం లేదన్నాడు. వికెట్ల మధ్య పరుగెత్తే విషయంలో రాయుడు విరాట్ కోహ్ల, డివిలియర్స్, డూప్లెసిస్, వార్నర్, బెయిర్ స్టోలోను చూసి నేర్చుకోవాలని సూచించాడు. అయితే ఆర్‌సీబీ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌‌లో నాలుగో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రాయుడు.. 18వ ఓవర్‌లో ఔటయ్యాడు. 40 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రాయుడు వికెట్ల మధ్య క్విక్‌గా పరుగెత్తలేకపోయాడని విమర్శించాడు. ప్రపంచంలోని బెస్ట్ ప్లేయర్లు వికెట్ల మధ్య ఎలా పరుగెడుతున్నారో చూడు. కోహ్లీ, డివిలియర్స్, డూప్లెసిస్, డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలను చూడు. వారిని అనుసరించు’అని రాయుడికి పీటర్సన్ సూచించాడు.

Related posts