telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్ పై పోటీకి సై..

అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల్ని ఇబ్బందులపాల్జేసి, కేంద్రప్రభుత్వానిదే తప్పిదమని చూపేప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి, తనకు ఎలాంటి విభేదాల్లేవని ఆయన స్పష్టంచేశారు.

రాబోయే రోజుల్లో ప్రజలే టీఆర్ఎస్ పార్టీని బండకేసి కొడతారనడంలో ఎలాంటి సందేహంలేదన్నారు. తాను పార్టీ మారుతానని ఈమధ్య కొత్తగా ప్రచారం వెలుగులోకొచ్చిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాజకీయ లబ్ధికోసం తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణలో కేసీఆర్ పాలనపై వ్యతిరేకత కన్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

బీజేపీ దేశాన్ని పాలించేపార్టీ, తెలంగాణకోసం ప్రజావిశ్వాసాన్ని చూరగొనే విధంగా మేనిఫెస్టో రూపొందించి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం ముసుగులో తెచ్చిన ధరణి పోర్టల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. రైతుల జీవితాలు ఆగమయ్యాయని విచారం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఒక్కొక్కరుగా దూరమైపోయారని, ఉద్యమకారులపై రాళ్లు రువ్వినవారే కేసీఆర్ పంచన ఉన్నారని పేర్కొన్నారు.

Related posts