telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యం: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణలోని ఆర్టీసీ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో లక్ష్మన్ భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె, తదుపరి కార్యాచరణపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డితో చర్చలు జరిపారు.

అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులపై టీఆర్ఎస్ నేతల కన్నుపడిందని పేర్కొన్నారు. వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను సొంతం చేసుకోవడానికి టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను భగ్నం చేస్తామన్నారు. కార్మికులు నిర్భయంగా సమ్మె కొనసాగించాలని, తాటాకు చప్పుళ్లకు బెదరవద్దని చెప్పారు. అవసరమైతే ఆర్టీసీ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపోతామని అన్నారు.

Related posts