telugu navyamedia
రాజకీయ

బాల్‌థాక్రే పేరును వాడొద్దు – ఉద్ధవ్ థాక్రే

*మ‌హారాష్ర్ట‌లో రాజ‌కీయ సంక్షోభం

*16మంది ఎమ్మెల్యేల‌కు అన‌ర్హ‌త వేటు
*ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స‌వాల్‌
*ఎన్సీపీ కాంగ్రెస్‌తోనే పొత్తు కొన‌సాగుతుంది.

శివసేన నేత, రాష్ట్రమంత్రి ఏక్‌నాథ్ శిందే తిరుగుబావుటాతో తలెత్తిన రాజకీయ సంక్షోభం \ నేప‌థ్యంలో శివ‌సేన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ముంబయిలోని పార్టీ కార్యాలయంలో సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో శివసేన జాతీయ కార్యవర్గం 6 తీర్మానాలను ఆమోదించింది.

శివసేన పేరు, పార్టీ వ్యవస్థాపకుడు  బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఏక్‌నాథ్ షిండే స‌హా రెబెల్ ఎమ్మెల్యేలు వాడ‌రాద‌ని తీర్మానం ఆమోదించింది. శివ‌సేన పార్టీకి సంబంధించి నిర్ణ‌యాలు తీసుకునే పూర్తి హ‌క్కు ఉద్ద‌వ్ ఉంద‌ని తెలిపారు.

మరోవైపు ఏక్‌నాథ్ షిండే  నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సైతం తాము ఉంటున్న గువాహటిలోని హోటల్‌లో భేటీ అయ్యారు.   తమ వర్గానికి  శివ‌సేన బాలాసాహెబ్ అనే పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. 

16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు డిప్యూటీ స్పీకర్. ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు.

బాలా సాహెబ్ థాక్రే పేరును ఎందుకు వాడాల‌నుకుంటున్నార‌ని ..వారికి ద‌మ్ముంటే  త‌న తండ్రి పేరు మీద ఓట్లు అడ‌గాల‌ని ఎన్ని ఓట్లు వ‌స్తాయో చూద్దామ‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు స‌వాల్ విసిరారు ఉద్ధ‌వ్ థాక్రే.

‘శివసేన బాలా సాహెబ్’గా నామకరణం చేయడంపై కొంత‌మంది స్పందించాలని తనను కోరుతున్నారని ఉద్ధవ్ పేర్కొన్నారు. అయితే దీని గురించి తాను ఇదివరకే చెప్పానన్నారు. ‘‘వారికి కావలసినదానిని వారు చేసుకోవచ్చు, వారి విషయంలో నేను జోక్యం చేసుకోను. వారి నిర్ణయం వారు తీసుకోవచ్చు. కానీ బాలా సాహెబ్ థాకరే పేరును మాత్రం ఎవరూ ఉపయోగించుకోకూడదు. ఈ విషయంలో శివసేన ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తుంది’’ అని ఉద్ధవ్ చెప్పారు

 

Related posts