telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

భారీగా తగ్గిన కూరగాయాల ధరలు!

tamata market

హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. ఈ సీజన్ లోనే అతి తక్కువ ధరలకు కూరగాయలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైనా కిలోకు రూ. 20 నుంచి రూ. 40 మధ్య ధర పలుకుతోంది. సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య దిగుబడి అధికంగా ఉండి కూరగాయల ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం జనవరి వరకూ చాలా కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలు చుక్కలు చూపాయి.

కానీ, ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. నిన్నమొన్నటి వరకూ కిలోకు రూ. 60 నుంచి రూ. 80 వరకూ ఉన్న ధరలు, ఇప్పుడు సగం వరకూ తగ్గాయి. ఇక శనివారం నాడు వివిధ మార్కెట్లలో కూరగాయల ధరలను పరిశీలిస్తే, కిలో టమోటా, క్యాబేజీ రూ. 10, వంకాయ రూ. 20, బెండకాయ, కాకరకాయ, బీరకాయ, గోకరకాయ రూ. 25, పచ్చిమిర్చి రూ. 30, దోసకాయ, పొట్లకాయ, దొండకాయ రూ. 20, బీట్ రూట్ రూ. 15, సొరకాయ రూ. 10, కాలీఫ్లవర్ రూ. 15పై అమ్మకాలు సాగుతున్నాయి.

Related posts