telugu navyamedia
సినిమా వార్తలు

రాధేశ్యామ్ నుంచి ఆక‌ట్టుకుంటున్న ‘సంచారి’..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్‌. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్ అభిమానుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. తాజాగా సినిమా నుంచి మ‌రో అప్డేట్స్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్‌.

Sanchari Song: రాధే శ్యామ్ నుంచి మరో సర్‌ప్రైజ్.. సింగర్‌గా మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ | Prabhas's Radhe Shyam Sanchari Video Song Released - Telugu Filmibeat

“సంచారి” అనే సాంగ్ ను విడుదల చేసింది. ఇందులో విజువల్స్​ చాలా రిచ్​గా ఉన్నాయి. ప్రభాస్​.. లవర్​బాయ్​గా, లైఫ్​ ఎంజాయ్​ చేస్తున్నట్లు కనిపించారు. ఈ పాటలో యూరప్‌లోని వివిధ అంద‌మైన ప్ర‌దేశాలు​ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సన్నివేశాల్లో ప్ర‌భాస్‌ స్టంట్లు అద్భుతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. తెలుగులో ఈ పాటకు లిరిక్స్ కృష్ణ కాంత్, సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించగా, అనిరుధ్ పాడారు.

Teaser for Sanchari song Radhe Shyam, starring Prabhas and Pooja Hegde. | News As It Comes , India & World

కాగా, 1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో ‘రాధేశ్యామ్’ను తెరకెక్కించారు. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి .“రాధే శ్యామ్” 2022 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related posts