telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

KTR

అసెంబ్లీలో జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1955 లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిందని..ఉమ్మడి ఏపీలో తెచ్చుకున్న చట్టం ఇంకా ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీకి కొత్త చట్టం తేవాలని గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని..జీహెచ్ఎంసీ చట్టంకి 5 సవరణలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళ సాధికారిత కోసం 50 శాతం రిజర్వేషన్లు…స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కలిపించిన రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. జీహెచ్ ఎంసీ లో ప్రతి డివిజన్ లో నాలుగు రకాల కమిటీలు ఏర్పాటు చేస్తాం…25 మందితో కమిటీలు వేశామని పేర్కొన్నారు.

రెండు టర్మ్ లకు ఒకే రిజర్వేషన్ అమలు అయ్యేలా జీహెచ్ఎంసీ చట్ట సవరణ చేశామని తెలిపారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలి అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వంను సంప్రదించి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునేలా చట్ట సవరణ చేశామన్నారు. ప్రజల భాగస్వామ్యం పెంచేందుకే వార్డుల కమిటీలని…మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీలు సమావేశమవుతాయని పేర్కొన్నారు. కార్పొరేటర్ స్థాయిని తగ్గించేందుకు ఈ కమిటీలు తీసుకు రావడం లేదని.. రాజకీయాలకు అతీతంగా వార్డు కమిటీలలో సభ్యుల నియామకం ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్లు జీహెచ్ఎంసీలో యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

 

Related posts