కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ ను దెబ్బతియ్యడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డితో కలిసి ఎనికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జాతీయ పార్టీలుగా భావించే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ ను ఓడించేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు.
ఎల్లలు దాటుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను అడ్డుకునేందుకే వారి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. తెలంగాణ పథకాలు యావత్ భారతదేశాన్ని ఆకట్టుకుంటున్నాయన్నారు. కుట్రలను ఛేదించేందుకు హుజూర్ నగర్ ఓటర్లు సన్నద్ధమవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.జాతీయస్థాయిలో పరస్పరం విరుద్దంగా ఉండే కాంగ్రెస్, బీజేపీల కుట్రలను విచ్ఛిన్నం చేయాలని ఓటర్లకు మంత్రి విన్నవించారు.