telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తౌక్టే తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణకు మాడు రోజులు భారీ వర్షాలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో’ తౌక్టే’ తుఫాను ముంచుకొస్తోంది. తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అత్యంత తీవ్ర తుఫాను’ తౌక్టే’ ఇంకా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. గడచిన 6 గంటలలో 15 km వేగంతో ప్రయాణిస్తూ, బలపడి ఈ రోజు ఉదయం 08:30 గంటలకు 18.8°N latitude మరియు 71.5°E longitude లలో, ముంబయికి పశ్చిమ దిశగా 150 km దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా తెలిపింది. అయితే తౌక్టే తుఫాను తెలంగాణా రాష్ట్రం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణా రాష్ట్రంలో దక్షిణ దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (18,19,20వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుండి మెరుపులు వర్షములు ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయని వాతావరణ పేర్కొంది.
వాతావరణ హెచ్చరికలు:- రాగల 3 రోజులు (18,19,20వ.తేదీలు) ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఒకటి, రెండు ప్రదేశములలో తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయని కూడా పేర్కొంది.

Related posts