telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇళ్లలోనే ఉండండి.. చేయి దాటితే ఏమీ చేయలేం: హరీష్‌రావు

harish rao trs

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు స్పందించారు. కరోనా లక్షణాలుంటే భయపడాల్సిన అవసరం లేదని.. వెంటనే అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండి సహకరించాలని ఆయన కోరారు.

చేయి దాటితే ఏమీ చేయలేమని.. ఓపికతో ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి తెలంగాణ కంట్రోల్‌లోనే ఉందని.. అయినా అశ్రద్ధ, నిర్లక్ష్యం వద్దని హరీష్‌రావు సూచించారు. సీఎం కేసీఆర్ కరోనాపై ప్రతి నిమిషం మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

Related posts