మూడు రాజధానుల వ్యవహరం రోజు రోజుకు రాజుకుంటోంది. ఈ వ్యవహరంతో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కూడా పెరుగుతోంది. ఆదివారం ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 13 జిల్లా అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని బొత్స పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నారని..టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆ పార్టీ నేతలు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని మంత్రి బొత్స ఫైర్ అయ్యారు.
రాజధాని వికేంద్రీకరణను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే బాబు అమరావతే రాజధాని కావాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్ దర్యాప్తు పూర్తవుతుందని, దేనిపైనైనా విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని బొత్స పేర్కొన్నారు. మాన్సాస్ వ్యవహారం కుటుంబ తగదా అని…ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని పేర్కొన్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధమవుతుందని, త్వరలోనే ఆఫీస్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు బొత్స.