telugu navyamedia
క్రీడలు వార్తలు

పడిక్కల్‌ కు ఆ సత్తా ఉంది అంటున్న బ్రాడ్‌ హాగ్…

ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి అందరిని దృష్టిని ఆకర్షించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ ఆటగాళ్లు విఫలమవుతున్న వేళ.. 20 ఏళ్ల పడిక్కల్‌ అద్భుతంగా పరుగులు చేస్తూ బెంగళూరుకు విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచులో మూడు అర్ధ సెంచరీలు బాదాడు. దీంతో మాజీలు అందరూ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌.. దేవదత్‌ పడిక్కల్‌పై ప్రశంసలు కురిపించాడు. అతనికి మొదటి ఐపీఎల్‌ అయినా అద్భుతంగా ఆడుతున్నాడు. క్వాలిటీ ఉన్న బౌలర్లు వేసిన షాట్‌ బంతులను సమర్ధంగా ఎదు​ర్కున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన షాట్‌ బంతులను ముందే గుర్తించిన దేవదత్‌ పడిక్కల్ చక్కగా ఆడాడు. ఇటువంటి ఆటను నా కెరీర్‌లో ఎన్నడూ చూడలేదు. నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడు అర్ధ సెంచరీలు బాదడం గొప్ప విషయం. మొదటి ఐపీఎల్‌లోనే ఇంత బాగా ఆడడం అతనిలోని ప్రతిభ బయటపడింది. భారత జట్టుకు ఆడగల సత్తా అతడిలో ఉంది’ బ్రాడ్‌ హాగ్‌ పేర్కొన్నాడు.

Related posts