ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం ఈ నటుడు ఎస్.కృష్ణ దర్శకత్వంలో “పహిల్వాన్” అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ “పహిల్వాన్”గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పలు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహాన్‌సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. స్టంట్స్ కోసం హాలీవుడ్ నుంచి లార్వెన్ సోహైల్ అనే నిపుణున్ని కూడా పిలిపించారు. అర్జున్ జన్యా సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో పహిల్వాన్ అనే టైటిల్ తో విడుదల కానుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కిల్లింగ్ లుక్స్ లో రియల్ పైల్వాన్‌లా సుదీప్ ఉన్నాడని చిరు అన్నారు. తెలుగు ప్రేక్షకులకి ఈ రియల్ పైల్వాన్ ఎంతగానో నచ్చుతాడని పేర్కొన్నారు.చిరు నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో సుదీప్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
previous post