telugu navyamedia
సినిమా వార్తలు

సస్పెన్స్ కు తెర… “మన్మథుడు-2″లో మహానటి

Keerthy-Suresh

మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్‌గా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్నారు. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగే కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటుందని మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ హీరోయిన్ స్థానంలో చాలా పేర్లు కూడా వినిపించాయి. ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగిన ఆ హీరోయిన్ ఎవరో తెలియజేస్తూ చిత్రయూనిట్ లొకేషన్ స్టిల్స్‌ను విడుదల చేసింది. ‘మహానటి’ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న కీర్తిసురేష్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. మన్మథుడు నాగార్జున ఒడిలో కీర్తిసురేష్ ఉన్న ఫొటోతో పాటు చిత్రంలోని కీర్తిసురేష్ సోలో స్టిల్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

Related posts