telugu navyamedia
సినిమా వార్తలు

45 డిగ్రీల ఉష్ణోగ్ర‌తలో… అప్పడాలు అమ్ముకుంటున్న హృతిక్

Hrithik-Roshan

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్ ప్రముఖ గణిత ప్రొఫెస‌ర్‌ ఆనంద్‌ కుమార్ జీవిత నేప‌థ్యంలో “సూప‌ర్ 30” అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జూలై 12న “సూప‌ర్ 30” చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్టు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. వెండితెర‌పై హృతిక్‌ తొలిసారిగా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన సినిమా ట్రైల‌ర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తాజాగా హృతిక్ త‌న ట్విట్ట‌ర్‌లో అప్ప‌డాలు అమ్ముకుంటున్న ఫోటోని షేర్ చేస్తూ… ఆనంద్ కుమార్ జీవితంలో అప్ప‌డాలు అమ్ముకునే ఘ‌ట్టం చాలా ముఖ్య‌మైన‌ది. ఆ స‌మ‌యంలో ఆయ‌న ప‌డ్డ క‌ష్టం, త‌ర్వాతి రోజుల‌లో ఇంత విజ‌యం సాధించ‌డానికి కార‌ణ‌మైంద‌ని పేర్కొన్నాడు. అయితే ఆనంద్ కుమార్ పాత్ర కోసం హృతిక్ రోష‌న్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్‌లోనే న‌టించిన హృతిక్ తొలిసారి డీ గ్లామ‌ర్ పాత్ర చేశాడు. అప్ప‌డాలు అమ్ముకుంటున్న ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ రాజ‌స్థాన్‌లో 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త ఉన్న స‌మ‌యంలో జరిపార‌ట‌. హృతిక్ క‌ష్టాన్ని చూసి చిత్ర యూనిట్ అభినందించింది.

Related posts