telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోవే పోరా ప్రోగ్రాం నుంచి సుధీర్ అవుట్… కొత్త యాంకర్ ఎవరంటే…

Jabardasth-Sudheer

సుడిగాలి సుధీర్ రెండు సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే సుధీర్ మరిన్ని సినిమాల్లో సైతం సోలో హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్నాడట. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ బాక్సాఫీసు దగ్గర హిట్ కాకపోయినా, కేవలం సుడిగాలి సుధీర్ క్రేజ్ తోనే లాభాలు గడించింది. దీంతో ఇప్పటికే ఢీ, జబర్దస్త్ షోలతో బిజీగా ఉన్న సుధీర్ ఇకపై పోవే పోరా ప్రోగ్రాం వదులుకునే చాన్స్ ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాదు పోవే పోరా ప్రోగ్రాం ఫార్మాట్ కూడా రొటీన్ కావడంతో ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తున్నారని, అంతేకాదు సుధీర్ తో పెయిర్ అంటే రష్మీయే తప్ప విష్ణుప్రియ ఎంత ప్రయత్నించినా హాట్ పెయిర్ గా నిలవలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో విష్ణుప్రియకు మరో ఎనర్జిటిక్ యాంకర్ తోడు అయితే పోవే పోరా ప్రోగ్రాంకు కొత్త జోష్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విష్ణుప్రియకు జోడిగా మాస్ అవినాష్ ను తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విష్ణుప్రియకు జోడీగా మాస్ అవినాష్ కలిసి క్యాష్ ప్రోగ్రాంలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇద్దరి మధ్య జగడం చాలా ఫన్ క్రియేట్ చేయడంతో పాటు, అవినాష్ మాస్ అప్పీల్ కూడా పోవే పోరాకు కలిసి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు మాస్ అవినాష్ కి శ్రీముఖి ఇప్పటికే మ్యూజిక్ రీలోడెడ్ ప్రోగ్రాంలో తన పక్కన యాంకరింగ్ చేసే చాన్స్ ఇచ్చింది.

Related posts