telugu navyamedia
సినిమా వార్తలు

గోస్ట్ లుక్‌లో భ‌య‌పెడుతున్న‌ స్టార్స్‌..

టాలీవుడ్‌ మెగాస్టార్​ చిరంజీవి అంటే అభిమానుల‌కు చెప్ప‌లేనంత అభిమానం. ఆయ‌న మాట‌, ఆయ‌న డాన్స్‌, ఆయ‌న స్టైల్ , ఆయ‌న యాక్టింగ్‌, అంటే ప‌డి చ‌చ్చిపోతారు..ఆయ‌న ఏ వేషం వేసినా ప్రేక్ష‌కుల‌కు పండ‌గే.. కొత్తగా గోస్ట్‌ అవతారంలో కనిపించి అభిమానులను అలరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్​గా మారింది.

అక్టోబర్​ 31న హలోవీన్ డే సందర్భంగా పలువురు నటులు సరదాగా సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ఇందులో భాగంగానే చిరు కూడా దెయ్యం లుక్​లో ఉన్న తన సరదా వీడియోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేశారు. ‘హ్యాపీ హలోవీన్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉత్కంఠభరితమైన రోజు’ అని వ్యాఖ్య రాసుకొచ్చారు. ​ అయితే ఆయన ఈ లుక్ కోసం మేకప్ వేసుకోలేదు. జస్ట్ ఓ యాప్ ఉపయోగించి వీడియో చేశారు.

అలాగే బాలీవుడ్ హీరో యిన్ శిల్పా శెట్టి హాలోవీన్ 2021 నుండి ‘జోంబీ వధువు’ లుక్ లో క‌నిపించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆమెను గుర్తించలేనంత‌గా భ‌యంక‌రంగా క‌నిపిస్తోంది. వీడియోను షేర్ చేస్తూ, శిల్పా, “హ్యాపీ హాలోవీన్.. అని రాశారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది మరియు ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.

Shilpa Shetty Kundra Looks Spook-Tacular as Zombie Bride for Halloween 2021,  Video Goes Viral | LatestLY

 

Related posts