telugu navyamedia
సినిమా వార్తలు

పునీత్ బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్నహీరో..

 త‌మిళ హీరో విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ రూపొందించిన చిత్రం ‘ఎనిమి’. మృణాళిని రవి కథానాయిక న‌టించ‌గా.. మమతా మోహన్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. మిని స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.వినోద్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా పునీత్ రాజ్ కుమార్ కి నివాళులర్పించి, ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.

puneeth: Vishal to take over the educational expenses of 1800 students who were being sponsored by Puneeth Rajkumar | Tamil Movie News - Times of India

“పునీత్‌ రాజ్‌కుమార్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదని, తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నారు” అని విశాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎనిమి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పునీత్‌కి నివాళులర్పించిన అనంతరం ..పునీత్ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.. అంతేకాదు త‌న స్నేహితుడు బాధ్యతను భుజానికెత్తుకున్నారు.

ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికీ తీరని లోటు. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. ఎంతోమందికి ఉచిత విద్యని అందించారు. వృద్ధాశ్రమాల్ని నడిపారు. ఇవే కాదు సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. ఇన్ని పనుల్ని ప్రభుత్వం చేసిందంటే నమ్మొచ్చు. కానీ, ఒక మనిషి చేశాడంటే నమ్మడం కష్టమే… చివరిగా తన కళ్లనీ దానం చేశారు. ”1800 మంది పిల్లల చిన్నారులనిచదువులను పునీత్ రాజ్‌కుమార్‌ చూసుకుంటున్నారు. ఆయన దానిని ప్రారంభించినందుకు నేను గర్వపడుతున్నాను. ఇక నుంచి తన స్నేహితుడిగా నేను చదివిస్తానని విశాల్ వాగ్దానం చేశారు.

Puneeth Rajkumar : పునీత్ సేవా బాధ్యతల‌ను తీసుకున్న హీరో విశాల్.. ఎంత గొప్ప మ‌న‌సు.. - India Daily Live

కాగా. పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీలోకి వాళ్ళే కాదు అభిమానులతో పాటు అందరూ ఆయన ఇక లేరన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు

Related posts