telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తనకు కరోనా పాజిటివ్ అంటూ సంచలన ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

varma not ready to leave tdp and tarak

గత రెండు మూడు వారాలుగా కరోనాకి సంబంధించి వరుస ట్వీట్లు చేస్తున్న వర్మ. బుధవారం రాత్రి 9.30 గంటలకు మరో ట్వీట్ పెట్టారు. ‘ఇప్పుడే మా డాక్టర్ నన్ను పరీక్షించి కరోనా పాజిటివ్ అని చెప్పారు’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. అయితే చాలామంది నీలాంటి వాళ్లకు అంత తొందరగా ఇలాంటి వ్యాధులు రావులే వర్మా.. ఈరోజు ఏప్రిల్ పూల్ కాబట్టి నీ నక్కజిత్తులు మాకు తెలియవా అంటూ కామెంట్ చేశారు. అయితే నెటిజన్లు ఊహించినట్టుగానే.. సారీ మిమ్మల్ని నిరాశ పరిచినందుకు క్షమించండి.. ఇప్పుడే ఆ డాక్టర్ ఇది ఏప్రిల్ పూల్ జోక్ అని చెప్పాడు.. అది అతని తప్పు నాది కాదు’ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఒకవైపు జనం చచ్చిపోతుంటే ఈ కుళ్ళు జోకులు ఏంటో అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Related posts